Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

4565..గజల్. 
హాయిగా స్వప్నమే..నడుపుగా ప్రాయమే..! 
ప్రేమయే భావమే..నేర్పుగా పాఠమే..! 
విరహమే తాపమే..శాపమే చూడగా.. 
చెలీ నీ హాసమే..పెంచుగా మోహమే..! 
ఊహయే దారమే..బంధమే గుండెకే .. 
చెలిమిలో కాలమే..తోడుగా గంధమే..! 
నీ మౌన దీపమే..సత్యమే వెలిగెనా.. 
దివ్యమౌ స్థానమే..కొలువుగా హృదయమే..! 
సంసార కావ్యమే..గీతమే పాడగా.. 
సరిగమల సారమే..కాదుగా భారమే..! 
తలపులో రాగమే..సంద్రమే వలపుతో.. 
మైమరపు చిత్రమే..చేర్చుగా తీరమే..! 
ప్రమోదం సొంతమే..కాయమే సాక్షిగా.. 
మాధవా మోదమే..మధువుగా భాగ్యమే..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

ప్రాయమే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.