Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

4564..గజల్. 
తనువొక వేణువు..మీటుట తెలిసిన..! 
రాధయె మనసోయ్..చూచుట తెలిసిన..! 
సంసారం ఒక..తియ్యని స్వర్గం.. 
అనుభవ సారం..పట్టుట తెలిసిన..! 
జగమే చక్కని..గ్రంథాలయమోయ్.. 
ఇష్టపూర్తిగా..చదువుట తెలిసిన..! 
సమస్త జీవులు..తాపసులేనోయ్..
నీలో నీవే..మునుగుట తెలిసిన..! 
గోవులు కాచే..పనియే పనిలే.. 
యుద్ధం క్రీడగ..ఆడుట తెలిసిన..! 
గగనమె కృష్ణుడు..నీలాకాశం.. 
ఊపిరి సాక్షిగ..ఉండుట తెలిసిన..! 
మాధవ తత్వం..మెఱుపుల వర్షం.. 
అంతరంగమున..చేరుట తెలిసిన..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

మీటుట తెలిసిన
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.