Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085


203..
శ్వాసించే అక్షరాల మౌనాగ్నియె.. నా ప్రేయసి..!!
మది దాటని భావధార మధురాగ్నియె..నా ప్రేయసి..!!
పలు వసంత సీమలలో పరవశించు రేణువులకు..
తన నాదము బహుమతొసగు స'రసాగ్నియె..నా ప్రేయసి..!!
హృదయలయల సవ్వడులకు సాక్షి ఎవరొ తెలియాలా..!?
అందాలకు బంధమేయు కాలాగ్నియె..నా ప్రేయసి..!!
ఊహలలో విహరించే చినుకుటెదల మీటాలా..!!
గంధాలను రక్షించే మర్మాగ్నియె..నా ప్రేయసి..!!
నన్ను చూసి నవ్వుతాయి చుక్కలన్ని స్నేహంగా..!!
పరిమళించు వాయులీన హాసాగ్నియె..నా ప్రేయసి..!!
ఆరాధను గమనించే 'మాధవు'డను 'నేనే' మరి..!!
నిన్ను నీకు కానుకొసగు యోగాగ్నియె.. నా ప్రేయసి..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నా ప్రేయసి
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.