Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

204..
నీ చూపే నిత్య ప్రణయ మంత్ర వర్ష ధార సుమా..!!
నీ నవ్వే ఇంద్రచాప వర్ణ వర్ష ధార సుమా..!!
కల హంసల కలల గగన వీధులలో విహారమా..!!
నీ జతలో ఎద లయలో అమృత వర్ష ధార సుమా..!!
వాలని కనురెప్పలలో వలపు సంతకాలు ఎన్నో..!?
కాలం కనుసైగలలో దివ్య వర్ష ధార సుమా..!!
పెదవి చాటు పలుకుల సడి వినిపించే రాగాలేవో..?!
గుండె తడిని దాచేసే మౌన వర్ష ధార సుమా..!!
విరహాలను కాల్చేసే రస పాతం ఉన్నదిలే..!!
జగములనే పాలించే ప్రేమ వర్ష ధార సుమా..!!
వేణు గాన మధురిమతో రాధనేలు 'మాధవు'డా..!!
విశ్వమునే నడిపించే ధ్యాన వర్ష ధార సుమా..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ప్రేమ వర్ష ధార సుమా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.