Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

205..
అద్దానికి అందేనా..నీ సొగసుల మల్లెల వని..!!
మౌన వీణ పలికేనా..నీ సొగసుల మల్లెల వని..!!
సిగ్గు పడెను బృందావని..అరవిరి నీ నవ్వుల గని..!!
చిత్రాలకు లొంగేనా.. నీ సొగసుల మల్లెల వని..!!
కడలి అలలు కలతపడెను..నీ నాట్యపు రీతుల గని..!!
పవనుడైన తాకేనా..నీ సొగసుల మల్లెల వని..!!
చినుకులెంత చింతించును..నీ భావ ధారల గని..!!
గగనమైన తెలిసేనా..నీ సొగసుల మల్లెల వని..!!
మన్మథుడే మై మరచును..నీదు మరుల వెలుగుల గని..!!
మెరుపులకే దొరికేనా..నీ సొగసుల మల్లెల వని..!!
నాదు మనసు శ్వాస మాటు..సాక్షి ఎవరు 'మాధవు'డా..!!
రాధకైన దక్కేనా..నీ సొగసుల మల్లెల వని..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

మల్లెల వని
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.