Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

207..
కణకణమున ఉంది చూడు..అసలు ప్రేమ చిరునామా..!!
మౌనంలో తొంగి చూడు..అసలు ప్రేమ చిరునామా..!!
కోపమేల ప్రియ నేస్తం..?! శత్రువులా..!? ఎవరు లేరు..!!
సత్యమిదే తెలిసి చూడు..అసలు ప్రేమ చిరునామా..!!
కన్న తల్లిదండ్రులతో..కర్మబంధమేను సుమా..!!
గురు పదమున చేరి చూడు..అసలు ప్రేమ చిరునామా..!!
బంధు మిత్ర జనులంతా..నీ కూడా పాత్రలేను..!!
నాటకమిది నిలచి చూడు..అసలు ప్రేమ చిరునామా..!!
పశు పక్షులు..జంతుకోటి..అన్నీ మరి నేస్తాలే..!!
మనసు పెట్టి తరచి చూడు..అసలు ప్రేమ చిరునామా..!!
మాటలన్ని ఆలోచనల..సాక్షులేను మాధ(న)వుడా..!!
చిరునవ్వున మునిగి చూడు..అసలు ప్రేమ చిరునామా..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

ప్రేమ చిరునామా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.