Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

213..
పలకరించే మనసు పాడే మౌన రాగమె ప్రేమ రూపం..!!
పులకరించే మబ్బు కురిసే దివ్య భోగమె ప్రేమ రూపం..!!
భ్రమను నిజముగ తలచుటేమీ తప్పు కాదది మనసు మాయే..!!
కలవరించే తలపు జరిపే నిత్య నాట్యమె ప్రేమ రూపం..!!
ఆశ మాటున దాగియున్నది ఇంద్ర ధనువుల కావ్య రాశియె..!!
పరవశించే వలపు పంచే వర్ణ చిత్రమె ప్రేమ రూపం..!!
కనుల నిండిన బాష్ప రాశికి అర్థమేదో తెలుప తరమా..?!
నిలువరించే చూపు నింపే భావ దీపమె ప్రేమ..!!
సాక్షి ఎవరో.. కాల వీణను మీటు క్షణముల వేలి కొసలకు..!!
అధిగమించే వెలుగు ఇచ్చే శ్వాస నాదమె ప్రేమ రూపం..!!
రాధ కోరిక తీర్చు 'మాధవ' తత్వ ధారకు అద్దమేదో..?!
అధివసించే కొలువు చూపే హృదయ వేదమె..ప్రేమ రూపం..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

ప్రేమ రూపం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.