Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

216..
నా కోసం విరబూసిన కాంతి పూల తోట నీవు..!!
నను వీడని చిరునవ్వుల పసిడి పూల కోట నీవు..!!
నీ మువ్వల సవ్వడియే వినరాదే..రవ్వంతయు..!!
వడి వడిగా సాగిపోవు మెరుపుపూల బాట నీవు..!!
మౌన నిధిని ఎదను నిలిపి మధురముగా చూసేవే..!!
అరకన్నుల నన్ను చూచు వెలుగు పూల ఊట నీవు..!!
పదపదమున అమృత రాశి నింపి ఏల మురిపింతువొ..?!
అలరించే అద్దమంటి ముద్దుపూల మూట నీవు..!!
ఎదురు చూపు తోటి పనే లేదు నాకు ఓ చెలియా..!!
నీ పదముల వెంట నడుపు తలపు పూల ఆట నీవు..!!
'మాధవు'నకు రాధమల్లె మనసు నిండినావు చూడు..!!
కలహంసగ నన్నేలే..చినుకు పూల పాట నీవు..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

పూల తోట నీవు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.