Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

224..
మొండితనం పనిముట్టుగ.. చేపడితే యాతనలే..!!
మాటలతో యుద్ధానికి.. తలపడితే యాతనలే..!!
ఏమిటలా..ఎందుకలా..?! ప్రశ్నిస్తూ వేదించకు..!!
ఎదుటి మనసు గమనించక..ఎగబడితే..యాతనలే..!!
నుదుటి రాత ఎటులుంటే అటులగునని తలపోయకు..!!
నీ రాతను మార్చుకొనక.. వెత పడితే..యాతనలే..!!
తెలిసి కూడా క్షమాగుణం..వదిలేస్తే ఎలాగబ్బ..!!
అపరాధపు భావనలో..దిగబడితే..యాతనలే..!!
పట్టువిడుపులుంటేనే..స్నేహానికి పరమార్థం..!!
అనుభవాల జడి వానకు..భయపడితే..యాతనలే..!!
రాధకసలు గొడవ లేదు కలనైనా ఏనాడూ..!!
'మాధవు'నే తెలుసుకొనక.. కలబడితే.. యాతనలే..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

యాతనలే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.