Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

225..
నీ తియ్యని చూపులలో..విరియునవీ గులాబీలు..!!
నీ నవ్వుల మెరుపులలో..కురియునవీ గులాబీలు..!!
గుండె లయల సవ్వడులకు పరిమళాలు అలదేవే..!!
నా ఆశల తోటలోన దొరుకునవీ గులాబీలు..!!
మౌనానికి మాట నేర్పు మధుర స్వర నిస్వనములు..!!
నా హృదయపు కోవెలలో వెలుగునవీ గులాబీలు..!!
శాంతి కొరకు పరుగులిడే శ్వాసలనే లాలించును..!!
నీ అడుగుల జాడలలో పొందునవీ గులాబీలు..!!
కోసి ఇవ్వలేనివిలే..చేతులెల చాచేవో..!?
నీదు సాక్షి బృందావని అందునవీ గులాబీలు..!!
'మాధవు'నే అడిగినంత..ఆ రాధయె అందించును..!!
కనులు మూసి తలచినంత..వలచునవీ గులాబీలు..!!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

గులాబీలు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.