Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085


226..
రాళ్ళు కాని రాళ్ళు కొన్ని.. ఇవ్వమంటె..నవ్వనేల..?!
తినడానికి ఉండ్రాళ్ళను.. పెట్టమంటె..నవ్వనేల..?!
శిల్పాలను చేక్కేందుకు.. పాల రాళ్ళు అద్భుతమే..!!
ఆ నవ్వుల పాల రాళ్ళు.. దాచమంటె..నవ్వనేల..?!
అందాలను చిందించే.. రతనాలూ గులక రాళ్ల..!?
మాటల్లో పలుకు రాళ్ళు.. ఏరమంటె.. నవ్వనేల..?!
రూపాయిల పాపాయిలు ముద్దాడే మిత్రులార..!!
కూడబెట్టు నాల్గు రాళ్ళు పంచమంటె.. నవ్వనేల..?!
పంటి క్రింది రాళ్ళ కన్న.. కంటి నలుసు బాధ మిన్న..!!
మనస్సాక్షి యారాళ్లను చూడమంటె.. నవ్వనేల..?!
'మాధవు'నకు..జగమంతా జవరాళ్ళు..ప్రియురాళ్లే..!!
రాధమ్మా..!ముద్దరాళ్ళ నాపమంటె..నవ్వనేల..?!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

నవ్వనేల
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.