నెలవల సహజ
1/781,N.T.R.nagar, Srikalahasti.

కరోనా చేసిన మేలు

మద్యం మత్తులో తప్పతాగి వీధులలో కొట్లాటకు దిగేవారిని అణచివేసిన - ఓ కరోనా

విధిరాతలే అని వెక్కి వెక్కి ఏడ్చే ప్రమాదాలు వెతికినా కానలేని స్థితిని కలుగచేసిన - ఓ కరోనా

పేపరు ఎత్తితేనే మానభంగాలు హత్యలు వ్యభిచారాలు  వాటిని ఊసే కనబడకుండా చేసిన - ఓ కరోనా

నిద్రలేస్తే కనపడని నిద్ర పోయాక ఇంటికి వచ్చి క్షణం తీరికలేక కంటికి కనపడని తండ్రిని కళ్ళెదుట ఉంచిన - ఓ కరోనా

రణగొన ధ్వనులతో కాలుష్యాన్ని నింపే వాహనాలను తగ్గించి కాలుష్య రహత పట్టణంగా మార్చిన - ఓ కరోనా

ఎన్నిసార్లు వేడినా ఒక్కరోజు సెలవు ఇవ్వని యజమానులు సైతం సెలవు తీసుకోమని వరాలిచ్చేట్టు చేసిన - ఓ కరోనా

ఏ ప్రభుత్వం అణచలేని నేరాలు ఏ ప్రభుత్వం చేయలేని మద్య నిషేధాలు బూచి వలే భయపెట్టి సాధించిన - ఓ కరోనా

నెలవల సహజ,

చిత్తూరు జిల్లా.

కరోనా చేసిన మేలు
కరోనా చేసిన మేలు
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
1
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
1 votes with an average rating of 1.