జ్యోతి మువ్వల
Flat No:207 KMC Manoharam Panaturu railway station road Panaturu Bangalore-560103
9008083344

 

పాలపుంత లోని గ్రహాలు

శాస్త్ర విజ్ఞానములో గ్రహంతరాలు

శాస్త్రంలోని నవగ్రహాలు 

దశ దిశలను పాలించే అధిపతులు!

 

కోరిన వరం కొంగుబంగారం కాగా

గ్రహాల అనుగ్రహం ఉందని

రవి రాచబాట చూపాడని

రాహు కేతువులు పగ బట్టలేదని

గురువుగారి గురి ఉందని 

శని గారు శపించ లేదని 

లావాలా పొంగి పోకు!

 

కాస్త కష్టానికే గ్రహ స్థితి గతి తప్పిందని

ఆశలు అడుగంటాయి అని

అథ పాతాళానికి తొక్కాయని

 ఇక నీ పని సమాప్తం అని 

గగ్గోలు పెట్టకు!

 

జరిగేది... జరగబోయేది

ఎవరు మార్చలేనిది!

కాలగమనాన్ని ఆపలేనిది

విధి లిఖితానికి కలిగిన జీవితం ఇది

పరిహారమే గాని పరిష్కారం లేని భవిష్యవాణి అది!

 

జరిగేది తెలుసుకొని

ఆపలేని ఆరాటానికి బీపీ, షుగర్ తెచ్చుకొని

భయపడుతూ బ్రతికే బ్రతుకు కన్నా

తెలియక బ్రతికే బ్రతుకులోని కలిగే ఆనందం మిన్న!

 

 పాపాల పరిష్కారానికై కలిగిన జన్మ

వీలైనంత పుణ్యాలను జమ చేసి తీర్చుకోవాల్సిందే కర్మ

ఆత్మశుద్ధి కలిగి పరమాత్ముడిని ఎరిగిన నాడు తీరిపోవును మానవజన్మ 

ఇదే కదా జీవితం... 

జగన్నాటకదారి ఆడినా నాటకం!!

 

-జ్యోతి మువ్వల

15/12/21

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

తాత్వికత , సామాజికం, భావుకత్వం
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.