జ్యోతి మువ్వల
Flat No:207 KMC Manoharam Panaturu railway station road Panaturu Bangalore-560103
9008083344

 శీర్షిక:లోకం తెలియని పసితనం!!

 

అన్యం పుణ్యం ఎరుగని పసితనం

మంచి చెడు తెలియని కుర్రతనం

స్వచ్ఛమైన మంచినీటిలా 

ఏ పాత్రలో పోస్తే అదే దాని ఆకారం!

వీచే గాలిలా పూచే పువ్వులా

కల్మషం అంటని పసి హృదయం!

చూసేదే సత్యమని

విన్నదే నిజమని 

అమ్మ నాన్నల అడుగులే మార్గమని

అనుకరించే అమాయకత్వం!

అవసరానికి ఆర్భాటానికి తేడా తెలియక

స్నేహంలోని చిలిపితనాన్ని

కొండ మీద కోతి నైనా

కోరుకునే మొండితనాన్ని

ఆకళింపు చేసుకునే వెర్రితనం !

 

చిన్న చిన్న తప్పులే చేతాడంతై 

మచ్చై కాల్చేను వారి జీవితం

చిన్నతనంలోనే తప్పోపులు సరి చేయకుంటే

అందేను అందమైన జీవితం !!

 

--జ్యోతి మువ్వల

 

 

 

 

 

 

 

 

 

 

బాల సాహిత్యం
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.