మార్గం కృష్ణమూర్తి
ఓ మనిషీ


శీర్షిక: *ఓ మనిషీ*

ఓ మనిషీ!
ఎటూ నీ గమనం!

నేను  నేను అనే
నేనే ఘనము అనే
అహము వీడు
ఒక మనిషిగా బ్రతుకి చూడు!

సమరస భావమే తోడు నీడ
లేదంటే నీకు ఉంటుంది తేడ
విడిపోయావో అయ్యేవు మోడు
ఈర్ష్య  అసూయలు కక్షలు  వీడు
ఉంటారు సమస్త జనులే నీకు ఎప్పటికీ తోడు!

నాకే అంతా తెలుసని
నేనే లేకపోతే ఏమీ జరుగదని
తోటి వారిని తొక్కేస్తానని
నిందించకు వ్యవస్థలదే,అంతా తప్పని
గుర్తుంచుకో నీవూ ఈ సమాజంలో ఒకడి వేనని!

నీకన్న మిన్న జగతిలో ప్రకృతి
మార్చ బోకు దాని ఆకృతి
సకల జీవకోటికది  సుకృతి
స్వార్ధభావముండిన చూపు వికృతి!

నేడు మనిషి చేసిన చిన్న తప్పిదం
కరోనా చేసే కరాళ నృత్యం
అల్ల కల్లోలమాయే ప్రపంచం
పేదా ధనికులని లేదు భేదం
చూప లేదు అది కులం మతం
కబలించే జనుల ప్రతి నిత్యం!

తండ్రిని కొడుకు చూడకుండా
కొడుకును తండ్రి చూడకుండా
శవాలను సహితం తాకకుండా
కన్నీరు ఘనీభవించే, రాల్చకుండా!

ఎంతటి గొప్పవారైనా ,కడు పేదవారైనా
తల్లిగర్భాన్నే జన్మిస్తారని, అవనిపైననే జీవిస్తారని
పుడమిలోనే కలుస్తారని
గిట్టిన ఏమీ తీసుకెళ్ళరనీ తెలుసు!

అయినా , మనిషి కెందుకింత స్వార్ధం
మనిషికెందుకింత అహం,అహంభావం

ఓ మనిషీ ... ఇక నైనా మేలుకో
కరోనా నుండైనా గుణపాఠం నేర్చుకో!

మార్గం కృష్ణ మూర్తి

రచనకు మీ మార్కులు ఇవ్వండి. పోటీ లో ఉన్న రచనలకు ఈ మార్కులు ప్రభావితం చేస్తాయి. బాగా అలోచించి మార్కులు ఇవ్వండి.
0
0
0
0
0
0
0
0
0
0
0
No votes have been submitted yet.
సంగారెడ్డి

PLOT NO.68 , KSR COLONY , ROAD NO.5 , AMEENPUR (MANDAL& POST) , HYDERABAD - 502032