P అరుణ్ కుమార్
రైతు దేవోభవ

శీర్షిక:
రైతు దేవోభవ


తన స్వేదాన్ని ప్రకృతిపచ్చదనానికి స్నేహం గా చేసి,
సేద్యం పేరుతో మన ప్రాణాల ఆకలికి అమ్మలా మారి
అన్నమై ప్రాణం పోస్తూ..
నింగికేసి అమాయకంగా
ఓ చూపు చూసి
వరుణదేవుడి వెలుగు రాకకై వేచిచూస్తున్న అన్నదాత గుండెతడి కవిత్వంతో కాసేపు ముచ్చటిస్తున్న కవికలాన్ని..
కాల గళాన్ని నేను..!

వినిపిస్తూనే ఉన్నాయి,
కనిపిస్తూ జ్ఞాపకాల జలపాతమై కదిలిస్తూనే వున్నాయి..!
మన కడుపులు నింపే రైతన్నల ఆకలి కేకల గర్జనల ఆవేదనలు..!
ఆత్మహత్యల చాటున అప్పుల వేదనలు..!
ప్రకృతి వైపరీత్యాల నడుమ ఆగని కన్నీటి ఆందోళనలు..!
ఆనాటి స్వాతంత్య్ర చరిత నుంచి
నేటి ఆధునికత దాకా
ఓటు బ్యాంకు రాజకీయాలే తప్ప..
రైతుకుటుంబాలను ఆదుకున్న ప్రభుత్వాలు అంతంతే..!
ప్రకటనలు మాత్రం అద్భుత మంతే..!
కనీస మద్దతు ధరకు నోచుకోని తన పంటతో..తన ప్రాణంతో..
దేశ రాజధాని నడిరోడ్డుపై ప్రభుత్వాలకు ప్రణామం చేస్తూనే వున్నాడు ఇంకా...మన అన్నదాత!
గాంధీ తాతమో విగ్రహమై ఏమీచేయలేక కుమిలి పోతూనే వున్నాడు కర్షకుని స్థితి,పరిస్థితిని చూడలేక..!
రైతన్న ఆకలి రాతని.. నాగలిగీతని.. బ్రహ్మ రాసిన బ్రతుకు పాత్రని..
మనమంతా ఏకమై ఆదుకుంటామని ప్రతిజ్ఞ చేద్దాం.
"రైతుదేవోభవ" అనేది ఈ దేశ నినాదమని జగతిని జాగృతం చేద్దాం..!
రైతును గౌరవిస్తూ..
రైతన్న గర్వాన్ని జాతీయ జెండాకు ప్రతిబింబంగా,
 అన్నదాత ఆత్మహత్యలు,
ఆకలి చావులు లేని స్వేచ్చా సమాజంలో ఎగరనిద్దాం..!

By P Arun Kumar

రచనకు మీ మార్కులు ఇవ్వండి. పోటీ లో ఉన్న రచనలకు ఈ మార్కులు ప్రభావితం చేస్తాయి. బాగా అలోచించి మార్కులు ఇవ్వండి.
0
0
0
0
0
0
0
0
0
0
0
No votes have been submitted yet.
నాగర్ కర్నూల్

P.Arun kumar
Lecturer in Physics
STAR junior college
Nagarkurnool
Pin:509209