నా పుస్తకం "నేను" నుండి రచన : 1979 సంవత్సరాంతం ప్రచురణ: అక్టోబర్, 2014
'నేను' (1979 సంవత్సరాంతం)
*****
'చంపకోత్సల'ముల శయ్యపై శయనించి, ఆలోచనలు జేయు నట్టివాడ !
'శార్దూల మత్తేభ' జాతులన్ గెలిచియు, స్థాపింతు భువిలోన శాంత రసము.
' సీనము' నొ(లొ) లికించి ఈసు, స్వార్థ పరుల మనసులన్ మార్పించు కొనగ జేతు,
నన్యాయ, మవినీతి నంతమొందింపగ, 'దండక' గతిజేతు భండనమ్ము
'తేటగీతు'ల తోడ నుత్తేజ పర్చి, 'ఆటవెలదు'ల తోడ సయ్యాట లాడి 'ద్విపద' దీపాలు వెలిగించి దివ్యమైన కాంతి జాతికి జూపించు ఘనుడ 'నేను'
నేను ఎక్కువగా వ్రాసిన పద్యాల పేర్లతో, రచనా సంవిధానాన్ని తెలిపే ఒక సీసపద్యమిది.
నా పదమూడో యేట, మా అన్నగారితో పాటు మా తండ్రి గారి దగ్గర పద్యరచన నేర్చుకున్నాను. మా ఇంట్లోనున్న సులక్షణ సారం (వ్రాత ప్రతి) కంఠస్థం చేసాను. 1979 వరకు నేను ఎక్కువగా వ్రాసిన పద్యాలతో, కూర్చిన పద్యమిది.
రేపు నా కవిత్వ చరిత్ర-1.