Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

దాహాలను చల్లార్చే సృష్టి కర్త దాహమేమి..!?
మోహాలను పరిమార్చే సృష్టి కర్త మోహమేమి..?!
ఆడుకోను ఎవరు లేరు..ఎవరి ఆట వారిదేను..!
ఆట గుట్టు వివరించే సృష్టి కర్త ఆటదేమి..!?
మౌనముగా సాగుతున్న నాటకాన అలజడులా..!
రాగసుధలు వర్షించే..సృష్టి కర్త రాగమేమి..!?
అందాలను విందు చేయు సుందరాంగు డెవరోయి..?!
గంధాలను దాటించే సృష్టి కర్త గంధమేమి..?!
అనురాగం ఆత్మీయత అణువణువున వెలుగుతోంది..
బంధాలను తొలగించే..సృష్టి కర్త బంధమేమి..?!
సాక్షిలాగా దీపాలకు ఉన్నవాడ 'మాధవు'డా..!
నామాలను వెలిగించే..సృష్టి కర్త నామమేమి..?!
కలహంసల రూపాలకు కలల రూపశిల్పి ఎవరు..?!
పరమార్థం అందించే..సృష్టి కర్త రూపమేమి..?!

సృష్టి కర్త
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.