Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

305
అమాయకత్వం దండిగ కురిసే.. పసి హృదయాలే కావాలిప్పుడు..!
జండా పట్టుకు జాతిని నడిపే.. పసి హృదయాలే కావాలిప్పుడు..!
సింహము నైనా సస్స్నేహంగా..కలుపుకు పోయే తత్త్వం చూడూ..
అద్భుత శక్తితొ మనసులు కుదిపే..పసి హృదయాలే కావాలిప్పుడు..!
తెల్లని వన్నీ పాలని నమ్మే..అజ్ఞానంతో బ్రతుకులు ఈడ్చే దెందుకు..?!
జ్ఞానం పెంచుకు జయములు నిలిపే..పసి హృదయాలే కావాలిప్పుడు..!
తియ్యని నవ్వులు చిందిస్తూనే..తేనెలు కురిసే పువ్వై జీవించాలోయ్..!
సహనం..మౌనం నిధులను పెంచే..పసి హృదయాలే కావాలిప్పుడు..!
విప్లవ కాంక్షను అణిచే యడమా!?..అర్థం లేనిది..అదియే ఊపిరి..!
జీవన ధర్మం హద్దులు కాచే..పసి హృదయాలే కావాలిప్పుడు..!
ఎవ్వరి కోసం ఎవరోయ్ ఇక్కడ.వెన్నును చూపే గన్నది పారెయ్..!
మిసైల్ సంస్కృతీ వెన్నును విరిచే..పసి హృదయాలే కావాలిప్పుడు..!
'మాధవ' తత్త్వం ప్రేమకు అద్దం..తెలిసిన నాడే యుద్ధాలంతం..!
అక్షయ స్నేహం విరివిగ పంచే..పసి హృదయాలే కావాలిప్పుడు..!

పసి హృదయాలే కావాలిప్పుడు
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.