Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

313..
జ్వాల కన్న తీవ్రమైనదేమంటే..నీ మాటే..!
మంచు కన్న చల్లనైనదేమంటే..నీ స్పర్శే..!
మాట మాటు మౌన నిధిని మునిగితేనె సౌఖ్యమోయి..!
తేనె కన్న మధురమైనదేమంటే..నీ పిలుపే..!
కనులనుండి స్నేహదీప్తి కురియవలెను ఎల్లపుడూ..!
పాల కన్న స్వచ్చమైనదేమంటే..నీ చూపే..!
గోర్వెచ్చని అమ్మ ఒడిగ..నీవుంటే తప్పేమిటి..!?
వెన్న కన్న మెత్తనైనదేమంటే..నీ మనసే..1
మట్టి నుండి బంగారం తయారగుట నిజమేలే..!
పసిడి కన్న మిన్నయైనదేమంటే..నీ శ్వాసే..!
సాక్షి మల్లె నీవుందువు..అది ఎట్లో..ఓ 'మాధవ'..!?
మనసుకన్న వేగమైనదేమంటే..నీ వెలుగే..!!

నీ మాటే
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.