Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

314..
ఎంతల్లరి చేస్తావే..ఓ నీలీ చిలుకమ్మా..!
వలపు తలుపు తట్టావే..ఓ నీలీ చిలుకమ్మా..!
ప్రేమ లేఖ నా బావకు అందించి రావేలా..!?
మలి సంధ్యా వేళాయే..ఓ నీలీ చిలుకమ్మా..!
నీ చిలిపీ ఆటలతో..పొద్దుపోయె చూడమ్మా..!
ఏరు ఎదురు చూస్తోందే..ఓ నీలీ చిలుకమ్మా..!
కొండగట్టు మీది నుండి నెలవంకా అలిగేనే..!
మేలిముసుగు మది కనవే..ఓ నీలీ చిలుకమ్మా..!
నా మనసే తెలియవేమి..ఎలా నీకు చెప్పాలోయ్..!?
తానొస్తే..సంబరమే..ఓ నీలీ చిలుకమ్మా..!
నా 'మాధవ' దేవునికే..నా సర్వం అంకితమే..!
అణువణువూ తన దయయే..ఓ నీలీ చిలుకమ్మా..!

నీలీ చిలుకమ్మా
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.