Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

316..
అలజడులను మాన్పు పండు.. అందమైన అరటి పండు..!
'విటమిను'లతో పుష్టినిడును..అందమైన అరటి పండు..!
సహజ శక్తి సంపదలను..కానుకివ్వ తలచు ప్రకృతి..!
పసిడి కన్న కూడ ఘనము..అందమైన అరటి పండు..!
తేలికగా జీర్ణమగును..త్వరితగతిని కడుపు నిండు..!
పేదవారి పూర్ణ ఫలము..అందమైన అరటి పండు..!
రసాయనిక ఎరువులొద్దు..సేంద్రీయత ముద్దు ముద్దు..!
ఆయువృద్ధి చేయు నిజము..అందమైన అరటి పండు..!
సత్యవ్రతము చేయు వేళ ప్రసాదమున చేరి కలియు..!
స్వచ్ఛమైన దివ్య ఫలము..అందమైన అరటి పండు..!
ఆ'రాధకు ..మనోరథము..నెరవేర్చగ తపము చేయును..!
మాధవునికి ప్రియము గూర్చు..అందమైన అరటి పండు..!

అరటి పండు
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.