అనంతపురం
ఆదిలాబాద్
ఇతర జిల్లా
కరీంనగర్
కర్నూలు
కామారెడ్డి
కుమురం భీమ్
కృష్ణ
ఖమ్మం
#కవిపరిచయం:
కవి పేరు: పోతగాని సత్యనారాయణ
కలంపేరు: పోతగాని
పుట్టిన తేది: 20-08-1976
తల్లిదండ్రులు: శ్రీమతి వెంకటనరసమ్మ,కీ.శే. సైదులు
జీవన సహచరి: శ్రీమతి నాగమణి(అమ్ములు)
సంతానం: చి॥ఉజ్వల; చి॥వేంకట సాయి రామ్ శరత్
పుట్టిన ఊరు: బాణాపురం;ముదిగొండ(మం);ఖమ్మం(జి)
విద్యార్హతలు: ఎం.ఎ(తెలుగు);ఎం.ఎ(హిందీ):HPT;NET;SET;P.hd
వృత్తి: హిందీ ఉపాధ్యాయుడు
ప్రవృత్తి: సాహిత్యం;చిత్రకళ;మరియు నటనా రంగాల లో సాధన చేయడం
రచనలు:
#విమర్శ
********
1.*'తెలుగు గజళ్ళు-ఒక అధ్యయనం'
(సిద్ధాంత వ్యాసం)
2.*'రెండో అధ్యాయానికి ముందుమాట-ఒక పరిశీలన'
(విరించి కవిత్వ రచనారీతులు)
3.*'అలౌకికానంద పూర్ణకలశి-యశస్వి పరాంప్రేయసి'
(జవాబులు లేని జాబులు)
4.*'మూడోకన్ను-కావ్యదర్శనం'
(చలపాక ప్రకాష్ కవిత్వతత్త్వం)
5.*'చాటింపు'(సాహిత్య వ్యాసాలు)
#కవిత్వం
************
6.*మట్టిఉప్పెన(కవితాసంపుటి)
7.*ముళ్ళూపూలు(తెలుగు దోహాలు)
8.*వసంత కుసుమాలు(తెలుగు గజళ్ళు)
9.*ప్రతిబింబాలు(నానోలు)
10.*పాలబువ్వ(బాలల కథలు)
11.*ప్రవాహస్పర్శ(కవితా సంపుటి)
12.*అనలసమీరం(కవితా సంపుటి)
13*స్వప్నశిల్పాలు(తెలుగు గజళ్ళు)
14.*వెలుగు బాల(శతకం)
#సంపాదకత్వం
***************
15.*పూలగోపురం(భీమవరం విద్యార్థుల కథలు )
16.*సత్య సందోహాలు(తొలి తెలుగు దోహాల సంకలనం)
#అనువాదాలు
*************
17.*కబీర్ వాణి(సాకీ హిందీ దోహాలకు తెలుగు దోహాల అనువాదం)
పురస్కారాలు
*************
ఉత్తమ గజల్ పురస్కారం 2017-గజల్ ఛారిటబుల్ ట్రస్ట్ (గజల్ శ్రీనివాస్ ఫౌండేషన్ )
డా.సి.నా.రె స్మారక గజల్ పురస్కారం 2018-కొమర్రాజు లక్ష్మణరావు ఫౌండేషన్ హైదరాబాదు
ANRమెగాలెజెండ్ అవార్డ్-2019-మెగారికార్డ్స్ డాక్స్ క్లినిక్ హైదరాబాద్
కలహంస పురస్కారం-2018నెలవంక నెమలీక మాసపత్రిక హైదరాబాద్
వేమన కళాసాహితీ పురస్కారం 2010
ఎక్స్ రే ఉత్తమ కవితా పురస్కారం -2007
మానస ఉత్తమ కవితా పురస్కారాలు -2005,2006
ఉత్తమ కవితా పురస్కారం 2017,2019 నవతెలంగాణ దినపత్రిక
గుంటూరు
చిత్తూరు
జగిత్యాల
పేరు : డా. వెల్ముల కృష్ణారావు.
తల్లిదండ్రులు: కీ.శే. మాధవరావు మరియు రాధాబాయి గార్లు
జననం : 10-02-1960 తిరుమలాపురం (P.D.), మండలం: గొల్లపల్లి, జగిత్యాల జిల్లా (TS). 505 532 (గతంలో కరీంనగర్ జిల్లా)
కలం పేరు : 'కవితశ్రీ'
సంప్రదింపులు : చరవాణి, వాట్సప్ నం.: 7780733021 (Jio), 9121006021 (Airtel)
ఇతర సామాజిక మాధ్యమాలు : ఫేస్ బుక్
ఇ-మెయిల్ : vkrao57gst@gmail.com మరియు surname.dic.vkrao@gmail.com
వృత్తి: నూజివీడులో డిప్యూటీ అసిస్టెంట్ కమీషనరు (ST)గా ఫిబ్రవరి., 2020లో పదవీ విరమణ.
ప్రవృత్తి/ అభిరుచులు :
౧) గతం : రచనలు, ఇంటిపేర్ల పరిశోధన, స్టాంపులు, నాణేల సేకరణ, పుస్తక పఠనం, యాత్రలు, content writing, Google Guide (Level-4) మొదలైనవి.
౨) ప్రస్తుతం : మొదటగా నా రచనలను పెట్టడానికి మరియు వీలైతే ఆ తర్వాత డిజిటల్ సేవలు అందించేందుకు వీలుగా, ప్రస్తుతం ఒక సొంత వెబ్సైట్ (చిరుతపత్రికలు.కాం) నిర్మాణ పనిలో వున్నాను.
ఇప్పటివరకు చేపట్టిన వివిధ సాహిత్య ప్రక్రియలు మరియు అంశాల మొత్తం: 20+ (వీటికి వివరములను కిందనివ్వబడినవి.)
1) పరిశోధన (Research) : రాజమండ్రి- ఇంటిపేర్ల పరిశీలన (అవార్డ్ తేది.30-08-14) పొ.శ్రీ.తె.వి.వి., హైదరాబాదు (సాహిత్య పీఠం, బొమ్మూరు)
2) నిఘంటువు (Dictionary) : విదేశాలలో వలె మనకు కూడా ఇంటిపేర్లపై నిఘంటువులు రావాలని, మహాకవి, సాహిత్య పరిశోధకుడు ... కీ. శే. ఆరుద్ర గారు తన పుస్తకం 'వ్యాస పీఠం'లో అభిలషించారు.
ఇప్పటివరకు ఏ భారతీయ భాషలలో కూడా ఇంటిపేర్లపై నిఘంటువులు రాలేదు. వారి వాక్యాలను స్ఫూర్తిగా తీసికొని, భాష, మతం, ప్రాంతం ప్రసక్తి లేకుండా, ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అన్ని సామాజిక వర్గాల ప్రజల ఇంటిపేర్లతో 'తెలుగు వారి ఇంటిపేర్ల నిఘంటువు' (2400+ ఇంటిపేర్లు)గా వ్రాయడం జరిగింది. ఆయా ఇంటిపేర్లను 10- 12 రకాల పారామితుల (Parameters) తో వివరించే ప్రయత్నం జరిగింది.
దీనిని మరింత విస్తృతం చేసి, ప్రపంచంలోని అందరు తెలుగు వారి ఇంటిపేర్ల నిఘంటువు తీర్చిదిద్దాలని నా అభిలాష.
3) సర్వే (Survey) : రాజమహే(0)ద్రి- ఒక అధ్యయనం. ప్రచురణ సం. సెప్టెంబర్, 2009 ISBN 1521/సా.తె. 900/56 954.84072
Town Anthropology సంబంధంగా, ఇది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలలో మొదటిది, అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ లో రెండోది.
(మొదటి అధ్యయనం, హైదరాబాద్ దగ్గర లోని #షామీర్ పేట ( #Shameerpet ) గ్రామం గురించి, 1952లో జరిగింది. #ఉస్మానియా యూనివర్సిటీ ( #Osmania University ) లోని 6 విభాగాల బృంద సహకారంతో, డా. ఎన్.సి. దూబే #N.C.Dube గారు ఈ పనిని చేపట్టారు. దీనిని #Indian Village అనే పేరుతో ప్రచురించారు. తెలుగులో '#భారతీయ గ్రామము', తె.అకా., 2005).
ఉత్తర భారత దేశంలోని కొన్ని గ్రామాల గురించి అధ్యయనాలు జరిగాయి. కాని, మన దక్షిణ భారత దేశంలో ఇలాంటి రచనలు ఇప్పటి వరకు వచ్చిన దాఖలాలు లేవు. (తెలిసిన వారెవరైనా దయచేసి నాకు తెలిపినచో, నేను సరిచేసికోగలను.)
4) సమగ్ర పదప్రయోగ సూచని (Glossary) : సాధారణంగా భారత, రామాయణం వంటి ముఖ్య పుస్తకాలకు వాటి పదప్రయోగ సూచిలు వచ్చాయి. కాని, అలా రాని వాటి సంగతి ఏమిటి? ఫలాన పదం ఏ పుస్తకంలో వచ్చిందో ఎలా తెలియాలి?
అలా వివిధ పుస్తకాలలో పేర్కోబడిన పదాలకు, ఒక సమగ్ర సూచనిని తయారు చేయడం ఈ పుస్తక ఉద్దేశ్యం.
5) స్మృతి కావ్యం (Eligy) : జీవన్ గీత. ప్రచురణ: అక్టోబర్, 2014
6) మోనోగ్రాఫ్ (Monograph) : ఆనభేరి- రణభేరి (భారత స్వాతంత్ర్య సమరంలో కరీంనగర్ జిల్లా అందించిన తొలి త్యాగనటుడు, అమరజీవి, ఆనభేరి ప్రభాకర్ రావు #Anabheri #PrabhakaraRao గారి గురించి) 7) కావ్యం: నిర్వచన, విశిష్ట, సంపూర్ణ కందరామాయణం. 8) ఆత్మకథ (Auto-biography). 9) శతకం : 'గోపబాల' శతకం.
*****
అక్టోబర్, 2014 వరకు జరిగిన పుస్తక ప్రచురణల సంఖ్య 3.
● రాజమహే(0)ద్రి- ఒక అధ్యయనం (క్ర.సం. 3), ● జీవిత గీత (క్ర.సం.5) మరియు ● నేను. (12 రకాల సాహిత్య ప్రక్రియలు/ అంశాలలో మచ్చునకు కొన్ని చొప్పున తీసుకొని, క్ర.సం. 10 నుండి 21 వరకు మాత్రమే చేర్చి 'నేను'గా వెలువరించాను.)
నేను : (ప్రచురణ: అక్టోబర్, 2014)
ఇందులో ...
10) పద్యములు (Poetry). 'కవితశ్రీ' ఖండ కావ్యం నుండి 11) గేయాలు (Songs ). 12) వచన కవిత ( Free verse ). 13) సమీక్ష ' (Review) : 'పద్యమజరామరము'... 14) రిపోర్టింగ్ (Reporting). 15) విమర్శ (Criticism). 'భీష్మ' నాటిక ప్రదర్శన (తే. 14-09-2008, ఆనం కళాకేంద్రం, రాజమండ్రి) 16) పుస్తక పరిచయం (Book introduction). శ్రీ రామన్న పంతులు గారి 'నాటకప్రయోగం' (1972) గురించి.
17) అనువాదం (Translation) : 'మాతృగీతములు' (రవ్వ శ్రీహరి గారి సంస్కృత పుస్తకం 'మాతృ గీతమ్' కావ్యం లోని, నాకిష్టమైన కొన్ని శ్లోకాలకు మాత్రమే నేను చేసిన స్వేచ్ఛానువాదం)
18) కథ (Story) 'మా అవ్వ చచ్చి పోయింది'
19) శాస్త్రీయ వ్యాసం (Essay). i) సూచీ సంఖ్యలూ- వాని ప్రాముఖ్యత (ఫిబ్రవరి, 1982), ii) How to attain India Zero Population growth 20) నాటిక (Short play). నవ (వన) చైతన్యం.
కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ లో సామాజిక వనవిభాగం #Social Forestry Dept.లో, నేను జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నప్పుడు, 1987లో వ్రాసిన నాటిక.
21) చిత్రకవిత్వం.
22) పోస్ట్ చేయని ఉత్తరాలు. 23) ఇంటర్వ్యూలు (Interviews). 24) 'గంధె' వారి కైఫీయతు. (సేకరణ)
*****