హైదరాబాద్

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

మాధవరావు కొరుప్రోలు, శ్రీ కొరుప్రోలు వెంకటేశ్వరరావు,శ్రీమతి రంగనాయకమ్మ గార్ల ద్వితీయ సంతానం;ప్రథమ కుమారుడు. పుట్టింది చెఱువుమాధవరం గ్రామం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం. తండ్రి వృత్తి రీత్యా ఉపాధ్యాయులు కావడంతో పుట్టిన ఆరు మాసాలకే తండ్రిగారు బదిలీపై ఖమ్మం జిల్లాలో చెన్నూరు చేరడంతో మాధవరావు ప్రాథమిక విద్య 8వ తరగతి సగంవరకు చెన్నూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. పదవతరగతి వరకు సోదిమర్లపాడు గ్రామంలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఇంటర్మీడియట్ బనిగండ్లపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగింది. ఆ తరువాత హైదరాబాద్ చేరుకుని డిగ్రీ బియస్ సి యంపిసితో అగర్వాల్ ఈవెనింగ్ సైన్స్ కాలేజీ మదీనా పత్తర్ గట్టీలో చదివి ప్రథమశ్రేణిలో 1981లో ఉత్తీర్ణులు కావడం జరిగింది. పగలు రాజేంద్రనగర్ లో అప్పటి AICRIP.


ఇప్పుడు DRRI (Directorate of rice research institute) లో ఒక తాత్కాలిక ఉద్యోగంలో పనిచేస్తూ చదువుకోవడం జరిగింది. 
బాలానగర్ లోని ఉషా శ్రీరాం డీజిల్స్ లో తన స్వయంప్రతిభతో టెక్నికల్ అసిస్టెంట్ గా సెలక్ట్ అయి ఒక సంవత్సరం పాటు పనిచేశారు. అప్పుడే పితృవియోగం సంభవించింది. కొద్దినెలలకే  అప్పట్లో ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ద్వారా వచ్చిన అవకాశంతో1983 జులై 5 కు ప్రభుత్వరంగ సంస్థ రక్షణ రంగం.. MIDHANI మిధానిలో స్వయంప్రతిభతో ఉద్యోగంలో చేరి క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఇన్స్పెక్టర్ గా సేవలందించడం మొదలుపెట్టి సీనియర్ ఇంజనియర్ గా పదవీవిరమణ 2021 మే లో పొందడం జరిగింది. ఉద్యోగం చేస్తూనే తనకు ఎంతో ఇష్టమైన తెలుగులో ఎమ్ ఎ పట్టా 1991లోనే పొందడం జరిగింది. 

చిన్ననాటినుండే మాతామహులైన సినీ మాటలు పాటల కవి రచయిత పద్యనాటక కర్త..నాటక కళానిధి కవిశేఖర శ్రీ ఊటుకూరు సత్యనారాయణరావు గారి స్ఫూర్తితో కవిత్వం పట్ల మక్కువ కలిగి నాటికలు కథలు వ్రాయడం ముఖ్యంగా ఎక్కువగా చదవడం అలవాటు చేసుకున్నారు. అలాగే చక్కని విప్లవాత్మక భావాలు కలిగి తనదైన శైలిలో తోటివిద్యార్థినీ విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ ఎప్పుడూ తరగతిలో ప్రథమశ్రేణిలో ఉండటమే గాక తరగతి నాయకుడుగా క్లాస్ పీపుల్ లీడర్ గా తోటివారి అభిమానం చూరగొనడం విశేషం. 

హరికథలు బుర్రకథలు వీధినాటకాలు విశేషంగా చూసి ఎంతో స్ఫూర్తి పొంది స్వయంగా చిన్నచిన్నవి సృజనాత్మకంగా వ్రాసి ప్రదర్శిస్తూ ప్రదర్శింపజేస్తూ మన్ననలు పొందారు. 
మిధానిలో పనిచేస్తూనే ఆకాశవాణి దూరదర్శన్ లలో అనేక కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. మిధాని గీతం తెలుగులో వ్రాసి ప్రశంసలందుకున్నారు. కవిత్వపరంగా కవితలు..పద్యాలు..గజళ్ళు ..లలితగీతాలు..భక్తిగీతాలు.. సుప్రభాతాలు..దండకాలు..దేశభక్తి గీతాలు. పుంఖానుపుంఖాలుగా వ్రాసి తెలుగు జాతికి అంకితం చేశారు.. చేస్తున్నారు. 

ముఖ్యంగా 2008నుండి విస్తృతంగా PSSM పిరమిడ్ ధ్యానం ధ్యానప్రచార కార్యక్రమాలు  చేస్తూ ఉన్నారు. 

వీరి ద్వారా స్ఫూర్తిని పొంది ఎందరో గజల్ రచనాసక్తులై గజల్ కవులు ఉద్భవించారు. 2014 డిశంబరు నుండి నేటివరకు నిర్విరామంగా గజల్ రచనా యజ్ఞంలో నిమగ్నమై దాదాపు 6000 గజళ్ళు వ్రాశారు. విశ్వప్రేమ తత్వమే ఊపిరిగా సాగుతున్నది వీరి గజల్ రచనా యజ్ఞం.

రచనలు

  1. నిశ్శబ్ధనాట్యం (కవితా సంకలనం)
  2. రాగధార (లలిత గీతాలు)
  3. ప్రియధరిత్రి (దేశభక్తి గీతాలు)
  4. వేణురాగం (కృష్ణ భక్తి గీతాలు)
  5. యువవసంత గీతిక (లలిత గీతాలు)
  6. శ్రీ సాయి గీతావళి (భక్తి గీతాలు)
  7. వినవో నా పాట వేంకటేశా (భక్తి గీతాలు)
  8. దండక రత్నమాల (ఏకాదశ దండకాలు)
  9. సాయి మాధవోక్తి (ఆటవెలది పద్యసహస్రం)
  10. శ్రీ సాయి సచ్చరిత్ర (నిత్యపారాయణ గ్రంథం)
  11. శ్రీ పత్రిమాధవోక్తి (ఆటవెలది పద్యశతకం)
  12. తెలుగుపద్య వసంతం (ఉత్పలమాల ద్విశతి)
  13. మాధవమోదారాలు (తెలుగు గజళ్ళు)[1]
  14. ధ్యాన మాధవోక్తి (ఆటవెలది పద్యాలు)
  15. మాధవ మందారాలు-2 (తెలుగు గజళ్ళు)
  16. మాధవ మంజరి (తెలుగు గజల్ మాలిక)
  17. మాట్లాడే మౌనం (కవితా సంకలనం)
  1.  మాధవరావు, కోరుప్రోలు (18 January 2019). "'మాధవ మందారాలు' పుస్తకావిష్కరణ"Andhrabhoomi. Secunderabad: Deccan Chronicle Holdings Limited. Retrieved 29 October 2021.
  2.  "మాధవరావు కోరుప్రోలు | National Registry of Telugu Poets"telugupoets.com. Retrieved 2021-10-30.
DSV Mahalakshmi Pen Sai Vijaya
హైదరాబాద్
Begumpet Hyderabad Telangana
M.అరుణ కుమారి
హైదరాబాద్
P. Gayatri Devi
హైదరాబాద్
6-3-628/16 Anand nagar. Khairtha bad Hyderabad