330..
ఏ మబ్బు.. పిలిచెనో.. పురివిప్పి ఆడేవు..!
ఏ మెరుపు.. అడిగెనో..పురివిప్పి ఆడేవు..!
స్వచ్ఛమౌ ప్రేమనే పంచేటి పింఛాల..
ఏ తలపు..నిండెనో..పురివిప్పి ఆడేవు..!
క్రేంకార ధ్వనులతో ఎటు పరుగు తీసేవో..?!
ఏ మరులు..పొంగెనో..పురివిప్పి ఆడేవు..!
నీ నీలి రంగుతో..అలరించు రారాజ..
ఏ తరులు..వలచెనో..పురివిప్పి ఆడేవు..!
విరహాల జ్వాలలే..ఎగసిపడు చుండగా..
ఏ గిరులు తలచెనో..పురివిప్పి ఆడేవు..!
మది మదిని ఏలేటి మాధవుని ప్రతినిధీ..
ఏ ఝరులు..వేడెనో..పురివిప్పి ఆడేవు..!