340..
నిత్యము నన్నే వీడక కాచే.. చక్కని నెలవంకా..!
నవ్వుల మెరుపై నన్నే నడిపే..చల్లని నెలవంకా..!
మబ్బులు ఎన్నో వస్తూ పోతూ.. ఉండుట సహజములే..!
మధువులు మదిలో ధారగ నింపే.. తియ్యని నెలవంకా..!
గంధాలన్నీ..బంధాతీతం.. చేసే పని నీదా..!
విరహము బాపే వెన్నెల కురిసే వెచ్చని నెలవంకా..!
ఎన్నడు చూడని లోకాలెన్నో.. చూపే జాణవులే..!
మనసను కలువను విరియగ జేసే.. మాయని నెలవంకా..!
కడలిని దాగిన అలలకు.. తీరని కోర్కెలు తీర్చేవా..!
గాయాలెన్నో లీలగ మాన్పే.. ఆరని నెలవంకా..!
తుంటరి మరులను..తుంచే 'మాధవ' నెచ్చెలి నీవేగా..!
వాడని బృందావనమును.. ఏలే పచ్చని నెలవంకా..!