361..
ఈనాటి ముషాయిరాకి..అంకితం.
లేఖలు వ్రాసే పనిలో హంసయె మునిగెను చూడు..!
అక్షర భామిని చక్కని గజలై వెలసెను చూడు..!
అందరి మనసులు తెలిసిన నాచెలి అక్షరమేను..
అక్షయ పాత్రగ ఆడుచు పాడుచు నవ్వెను చూడు..!
కోర్కెల కడలిని ఎగసే అలలను అణచగ నీదు..
తన చిరునగవుల వెన్నెల నదిలో ముంచెను చూడు..!
మౌనపు తోటను సుస్వర వీణగ పలికించుటకై..
భావము లోపల సొగసుగ వీడక నిండెను చూడు..!
ఆశల చిలుకను అలరించుటకై పండే యగునోయ్..
చినుకుల ఎదలో తపముల మధువై చేరెను చూడు..!
మాధవ' ధారగ పొంగే సుధలో వెలిగే బాల..
వెచ్చని తియ్యని కమ్మని గజలై వెలిగెను చూడు..!