గజల్..3636.
వికారాలు తొలగించే..జ్ఞానమొసగె నా ప్రేయసి..!
మరణభయం కాల్చివేయు..నిప్పునొసగె నాప్రేయసి..!
ఈ జగత్తు కన్నతల్లి..'శార్వరి'యని తెల్పె తాను..
సంప్రదాయ పరిరక్షణ..కవచమొసగె నాప్రేయసి..!
హింసాత్మక చర్యలింక..మానమంటు హెచ్చరించె..
సమభావన పండించే..హృదయమొసగె నాప్రేయసి..!
తను ఉగాది కోకిలలా..కొలువుతీరె నా మదిలో..
సుస్వరాల వెల్లువకే..వలపులొసగె నాప్రేయసి..!
చక్రధ్వజ మెత్తెనుగా..'శార్వరి'కే స్వాగతమని..
ఈ మానవ మేధస్సుకు..సవాళ్ళొసగె నాప్రేయసి..!
మరి మాధవ గజల్ నిధిని..పోషించే వనరాణిరొ..
నవవసంత రాగాలకు..గంధమొసగె నాప్రేయసి..!