397..
ఎంత సేపు పాడుకోను.. ఒంటరిగా..నా..గీతం..!
ఎన్ని మార్లు పాడుకోను..ఉప్పరిగా..నా..గీతం..!
పనిలేదే మధువు తోటి..కలనైనా ఏ జన్మకు..
ఎలా నీకు తెలుపుకోను..మరి సిరిగా..నా..గీతం..!
పసిడి తరులు..కాంతి గిరులు..సెలయేరులు నీవేగా..
ఏల నీకు పంచుకోను..రస ఝరిగా నా..గీతం..!
హృదయాలను హత్తుకునే సుతిమెత్తని రాగధునీ..
ఎటుల గళము విప్పుకోను..మాధురిగా నా..గీతం..!
శుక పికములు కలసి కురియు ఆ స్వరముల దారులలో..
కోకిలగా చెప్పుకోను..మల్హరిగా నా.. గీతం..!
'మాధవు'డా..! నీ వేణువు పలకరింప పులకరింతు..!
ఆ'రాధాగ నిలుపుకోను..బిల్హరిగా నా గీతం..!