413..
చిన్ననాటి జ్ఞాపకాల తోట లోన ఉన్నావా..!
తిరిగి రాని సంతసాల తోట లోన ఉన్నావా..!
తలపులతో మురిసిపోవు వేళలన్ని మధురములే..!
ఊరించే మధురసాల తోట లోన ఉన్నావా..!
నీ నవ్వుల మల్లెలకై తాను వచ్చు సమయమాయె..!
సిగ్గు తెరల చంద్రశాల తోట లోన ఉన్నావా..!
నీ కన్నులు చెబుతున్నవి కవితలెన్నొ నా చెవిలో..!
పలకరించు సుస్వరాల తోట లోన ఉన్నావా..!
మౌన నిధిని పొంగి పొరలు ఆత్మీయత చిందేవా..!
హాయినొసగు పరిమళాల తోట లోన ఉన్నావా..!
'మాధవు'నకు ఇష్ట సఖిగ మారాలని తలచేవా..!
అంతులేని ప్రభు వరాల తోట లోన ఉన్నావా..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు