Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

415..
కలలకు రెక్కలు తొడిగే నిద్దుర ఎన్నాళ్ళింకా ..?!
కోర్కెల తోటను ఒదిగే నిద్దుర ఎన్నాళ్ళింకా..?!
ఎక్కడి గొంగళి అకడే ఉందను ఏడుపు ఎందుకు..?!
మంచం గొడవే మునిగే నిద్దుర ఎన్నాళ్ళింకా..?!
మెలకువ పొందని మానవ జన్మకు అర్థం లేదోయ్..!
భర్తగ భార్యగ మరిగే నిద్దుర ఎన్నాళ్ళింకా..!?
కబుర్లవరకే పరిమితమైతే అవునా స్నేహం..?!
సాయం ముసుగున మలిగే నిద్దుర ఎన్నాళ్ళింకా..?!
రెక్కలు నమ్ముకు బ్రతికే పక్షికి లేదా జ్ఞానం..?!
అజ్ఞానంతో నలిగే నిద్దుర ఎన్నాళ్ళింకా..!?
మనిషి తనానికి 'మాధవ' తత్త్వం తోడే ఎపుడూ..
సంచిత కర్మలు పెరిగే నిద్దుర ఎన్నాళ్ళింకా..!?


మాధవరావు కోరుప్రోలు. 
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు
 

నిద్దుర ఎన్నాళ్ళింకా
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.