423
పాత జ్ఞాపకాల పుట్ట.. మనసంటే.. ఓ నేస్తం..!
తీపి వలపు పండ్ల బుట్ట..బ్రతుకంటే..ఓ నేస్తం..!
కలలన్నీ నీ భయాలు ఇష్టాలకు బింబాలే..!
జన్మ సుడుల తేనె తుట్ట..జగమంటే ఓ నేస్తం..!
బడికి గుడికి పరుగులిడగ తెలిసేనా ముక్తియనగ..?!
విడివడు'నా పాము చుట్ట..అహమంటే ఓ నేస్తం..!?
తపముసేయ తగిన శక్తి ఎట్టులబ్బు నీ తెలివికి..!?
ఏమున్నది'నాది' యనుచు ముట్ట.. సుఖమంటే ఓ నేస్తం..!
వసంతాలు పరిమళించు కాలవీణ రాగాలకు..!
చిరుగు బట్ట చూడు కుట్ట..కల'లంటే ఓ నేస్తం..!
'మాధవు'డవు నీవౌదువు..నీ తనువు వేణువైన..!
కరిగి పోవు పసిడి గుట్ట..మధువంటే' ఓ నేస్తం..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు