432..
వెన్నెలలకు మధువు నింపు - నీ నవ్వే నా ప్రేయసి..!
హంసలకే పలుకు నేర్పు - నీ చూపే నా ప్రేయసి..!
మరువలేని..మరపు రాని - జన్మలనే మరపింతువు..!
విరహ వీణ ఎదను మీటు - నీ తలపే నా ప్రేయసి..!
అనుభూతుల జలధి మాటు - మౌన నిధికి నడిపింతువు..!
రాగబంధ తెరలు కాల్చు - నీ వెలుగే నా ప్రేయసి..!
కనుసైగతొ కలలగగన - వీధులనే కరగింతువు..!
మనసులోని మరులు రాల్చు - నీ వలపే నా ప్రేయసి..!
బాధించే మంత్రాలను తంత్రాలను తొలగింతువు..!
సాక్షి సుధకు ప్రాణమూదు - నీ శ్వాసే నా ప్రేయసి..!
'మాధవు'నకు మహిమాన్విత - వేణుగాన రసఝరివే..!
బృందావన కోటి నిలుపు - నీ ధ్యాసే నా ప్రేయసి..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు