433..
నా ప్రేమను వర్షించే అక్షరాల మందారం..!
నీ కోసం విరబూసే విలాసాల మందారం..!
విశ్వమైత్రి గగనాలను ఏలుతున్న గజలైనది..!
ఎదఎదలో సుధ నింపే కులాసాల మందారం..!
హిమ పాతపు దారులలో నవ హాసపు వెలుగైనది..!
ప్రతి కవితకు నాదమయే సరాగాల మందారం..!
తన సొగసులు వాడనీక పరిమళించు సుమకోమలి..!
భావవీణ శృతి చేసే..సుస్వరాల మందారం..!
స్వర్ణ కమల పత్రాలకు పరిమళాలు మేళవించు..
మాతృ హృదయ లయ కాచే సాహసాల మందారం..!
ఓ 'మాధవ' నీ వేణువు సాక్షిగానె నను నిలుపుము..!
జన్మ గతుల దిశ మార్చే పరవశాల మందారం..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు