435..
తెలిమంచు ముత్యాల ~ వానయే నీ మాయ..!
తొలిపొద్దు కిరణాల ~ స్మరణయే నీ మాయ..!
ఏనాటి బంధమీ వెన్నెలై విరిసెనో..!
ఎదలోని భావాల ~ ధారయే నీ మాయ ..!
వాగులో వంకలో గలగలల సొగసులో..!
తూగాడు నాదాల ~ కరుణయే నీ మాయ ..!
కలలకే చిత్రాలు పొదిగేటి జాణవే..!
కలహంస రాగాల ~ వీణయే నీ మాయ ..!
ఓ గాలి పటముగా ఎగిరేందుకేముంది..?!
ఆ మెరుపు మణిమాల ~ జాడయే నీ మాయ ..!
'మాధవా'..! రాధతో..క్రీడలను నిలుపకో..!
నావైన పరువాల ~ మేడయే నీ మాయ ..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు