451..
వసివాడని పువ్వులాగ - జీవించుట వరమేలే..!
దరహాసం చిందిస్తూ - మరణించుట వరమేలే..!
నిను గాంచిన కన్నులతో - చూచుటేల ఈ జగతిని..?!
అన్ని మరచి నీ సన్నిధి - వసియించుట వరమేలే..!
గొడవెరుగని కలహంసల - సరోవరము చేర్చినావు..!
ఉన్నదంత మాయేనని - గ్రహియించుట వరమేలే..!
అణువణువును మధురరాగ - వేణువుగా చూపినావు..!
తలపులన్ని మెరుపులుగా - వర్షించుట వరమేలే..!
బృందావని పొదపొదలో - స్నేహసుధలు నింపేవే..!
సత్యముతో ఉండేందుకు - దీవించుట వరమేలే..!
మౌనముతో మాటలాడు - ''మాధవు''డా..! ప్రియ విభుడా..!
ఈ రాధను వెన్నెలగా - పండించుట వరమేలే..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు