453..
ఓ చిన్ని పువ్వుగా మిగులనీ నీ ఎదుట..!
ఓ మధుర స్వరముగా వెలుగనీ నీ ఎదుట..!
నీవెవరు.. నేనెవరు..నిజమేదొ తెలియాలి..!
ఓ హంస పదముగా నిలువనీ నీ ఎదుట..!
నాకంటి దీపమే నీవంచు తెలిసెలే..!
ఓ గుండె నవ్వుగా మారనీ నీ ఎదుట..!
నాదైన ఈ వనము నీ విహార స్థలము..!
ఓ ప్రేమ చిగురుగా ఎదగనీ నీ ఎదుట..!
ఆశలకు అద్దమౌ ఈ మనసు గొడవేమి..?!
ఓ తేనె చినుకుగా ఒలకనీ నీ ఎదుట..!
మాధవా రాధనే అయితినా తెలుపవా..!
నీ వేణు రవముగా ఒదగనీ నీ ఎదుట..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు