461..
మెల్లగ వీచే గాలిని అడిగా - నీ చిరునామా..!
ముద్దుగ విరిసే దారిని అడిగా - నీ చిరునామా..!
మనసున నిండే మువ్వల సవ్వడి ముచ్చట ఎంతో..?!
నవ్వుతు దూకే యేటిని అడిగా - నీ చిరునామా..!
చల్లని వెన్నెల గళమును మీటే దెవరో..?!
ఝుమ్మని పాడే తేటిని అడిగా - నీ చిరునామా..!
ఎంతకు చిక్కని జాణవు నీవని తెలియదు సఖియా..!
ఊపిరులూదే శిల్పిని అడిగా - నీ చిరునామా..!
కన్నుల జలధిని వెలుగులు నింపే హంసల రాణీ..!
మన్మథు నిలిపే సాక్షిని అడిగా - నీ చిరునామా..!
చింతలు సకలం బాపే రాధా..''మాధవ'' మోహిని..!
తియ్యగ నవ్వే శక్తిని అడిగా - నీ చిరునామా..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు