469..
మెరుపుమల్లె నా మనసును - నీ మనసున చేరనిమ్ము..!
గులాబిలా నా వలపును - నీ పదముల వాలనిమ్ము..!
చిరుగాలిని అలరించే - నీలి కురుల ప్రియ సఖియా..!
మౌనముగా నా తలపును - నీ సొగసుల నిండనిమ్ము..!
మరుమల్లెల జల్లులాగ - వస్తావే ప్రతి కలలో..!
నా ఆశల 'మాధవ'మును - నీ నవ్వుల విరియనిమ్ము..!
ఏరువాక వేళలోన - ఎదమీటే వెన్నెలవే..!
నా పలుకుల పరాగమును - నీ అడుగుల రాలనిమ్ము..!
మధువేదో..ఊరించగ - పరవశించె నా హృదయం..!
ప్రతి అక్షర సోయగమును - నీ చూపుల కురవనిమ్ము..!
చైత్ర వీణ తంత్రులపై - విరహమధువు పొంగేనా..!?
ప్రతి కోకిల సరాగమును - నీ స్వరమున వెలుగనిమ్ము..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు