476..
చిరునవ్వుల లలితాంగీ విశ్రమించు వేళాయెను..!
మరుమల్లెలు మెలమెల్లగ పరిమళించు వేళాయెను..!
జాబిలికే చల్లదనము నింపు చూపు నీదేలే..!
ముంజేతుల కంకణాలు పలుకరించు వేళాయెను..!
వెన్నెలేమొ అంటున్నది గుసగుసగా ఆ గాలితొ..!
ఈ నందన వనమేమో పరవశించు వేళాయెను..!
పూలఋతువు పాన్పు వేసె మనకు సాక్షి తానవ్వగ..!
పెండ్లిపీటమల్లె పుడమి పులకరించు వేళాయెను..!
కనులోన కనులు కలుప బిడియమేల ప్రియ సఖియా..!
నీ మోమున ఆ కుంకుమ సందడించు వేళాయెను..!
నీ తియ్యని అధరయుగళి నేలు 'మాధవు'డను నేను..!
మురిపించగ జాగదేల - కనికరించు వేళాయెను..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు