485..
కోరుతున్నా కలనుకూడా.. క్షణము విడువని చెలిమి తోడును..!
దాచుకున్నా బ్రతుకు నడిపే.. ఆశ వదలని చెలిమి తోడును..!
బంధమేదో..ఎంతసేపో..తెలిసి తెలిసీ.. కలహ జ్వాలలు రేగుచున్నవె..!
నిలుపుకున్నా గుండె లోయన.. గొడవ ఎరుగని చెలిమి తోడును..!
ఇంద్రధనువులు వెల్లువెత్తే.. మనసు కోవెల.. పదిలపరచగ సమయమాయెను..!
అడుగుతున్నా మౌన వనమై.. నిదురమరగని చెలిమి తోడును..!
అద్దమేలా పనికి వచ్చును..యుద్ధభూమికి రథము నడుపగ..!?
పంచుతున్నా పలుకుసంపద విలువ మరువని చెలిమి తోడును..!
సంప్రదాయపు గూటి చిలుకలు.. పడే కష్టం తీరుటెన్నడు..!?
వేడుతున్నాఆలు మగలకు.. పగలు తెలియని చెలిమి తోడును..!
ప్రేమతత్వపు సాక్షి నీవే.. వేణు'మాధవ'..తెల్లవారెను..!
ఒంపుతున్నాతలపులందున.. కనులు మలగని చెలిమి తోడును..!
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు