492..
మౌనవీణ రాగాలకు - పట్టు పరుపు లెందుకటా..!?
మందహాస దైవాలకు - మేలుకొలుపు లెందుకటా..!?
ఘనతలేవొ సాధించగ - అగచాట్లవి తప్పదులే..!
కలహంసల పయనాలకు - వలపువీధు లెందుకటా..!?
తడిసిపోవు వానవిల్లు - చిరునామా మనసైతే..
స'రస మధుర పవనాలకు - మంకు రుతువు లెందుకటా..!?
ఎగసిపడే అలల కడలి - కోరికలకు అద్దమేది..?!
దాచలేని సంపదలకు - పొదుపుతగవు లెందుకటా..!?
ఎదురొచ్చే తుఫానులను - నిలువరించు శక్తి ఎచట..?!
ఆలుమగల స్నేహాలకు - అడ్డు ఆపు లెందుకటా..!?
గగనంలో విహరించే కాంతిపడవ గొడవేమిటి..?!
నిజ'మాధవ' దీపాలకు - దిద్దు మెరుపు లెందుకటా..!?
మాధవరావు కోరుప్రోలు.
హైదరాబాద్,
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు