507..
చినుకు మనసు చూస్తుంటే..చిలుకలాగ ఉన్నది..!
అక్షరాన్నిచూస్తుంటే..మౌనిలాగ ఉన్నది..!
మట్టిగుండె మీటేందుకు ఒక్క చినుకు చాలదా..
మబ్బుతలపు చూస్తుంటే..'శక్తి'లాగ..ఉన్నది..!
మెరుపుకన్నె ఊహలలో నిండు రాగమేమిటో..?!
పూలఋతువు చూస్తుంటే..తరుణిలాగ.. ఉన్నది..!
చిగురుటాకు వలపులలో పొంగు హాస మాధురీ..!
నీ పూజను చూస్తుంటే..భక్తిలాగ..ఉన్నది..!
పరిమళాల దారంతా పరచుకున్న దెవ్వరో..?!
చిలిపితనం చూస్తుంటే..గాలిలాగ..ఉన్నది..!
పరుగు తీయు మానసమును నిలుపుటెలా నేస్తమా..!
వలపుధనం చూస్తుంటే..సరసిలాగ..ఉన్నది..!
నవ్వుతున్న 'మాధవు'నకు వెన్నెలైన రాధయే..
కాస్త ఆగి చూస్తుంటే..సాక్షిలాగ..ఉన్నది..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు