508..
కొమ్మమదిని చూస్తుంటే..కోటలాగ.. ఉన్నది..!
అమ్మ చూపు చూస్తుంటే..తోటలాగ..ఉన్నది..!
ఏ రాగం పాడేనో నవవసంత వనరాణి..!?
వినగ తొంగి చూస్తుంటే..ఆటలాగ..ఉన్నది..!
పలుకుతేనె సొగసులతో ఊరించే మౌనమా..!
నీ దయ'నే చూస్తుంటే..ఊటలాగ..ఉన్నది..!
పూసలేల గుచ్చేవో ఏ దారం లేకుండ..!
నీ నవ్వే చూస్తుంటే..పేటలాగ..ఉన్నది..!
మూసలాంటి తనువేలే మేటి తపము చేసేను..!
పట్టుదలే చూస్తుంటే..పీటలాగ..ఉన్నది..!
'మాధవు'నకు తోడు రాధ ఆ యమునా తీరాన..
అనురాగమె చూస్తుంటే..పాటలాగ.. ఉన్నది..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు