511..
చెట్టు చెట్టును మహాయోగిగ చూచు కన్నులు పొందినామా..?!
మనసు మనసును దివ్యజగముగ చూచు భాగ్యము అందినామా..?!
పూజ చేసే చేతులందున నలుగు పూవుల భాష వినుమో..!
పరిమళాలను పంచు గాలులు పలుకు తత్వము తెలిసినామా..?!
సుఖము కొరకై తీయు పరుగున ఉన్నకష్టం ఏమి నేర్పునొ..!?
పాము పామును పరమగురువుగ తెలియు జ్ఞానము పట్టినామా..!?
ఎదుగుదలకై చేయు యత్నములోని భాగమె.. నిన్ను నడుపును..!
ఎగురు పక్షుల కలరవమ్ముల హృదయగగనము చూసినామా..?!
స్నేహరాగము ప్రతిధ్వనించు మౌన వీధుల సంచరించగ..
ఎదను దాగిన స్వర్గ సీమను కాంచు ధర్మము పూనినామా..?!
ఎన్ని జన్మలు ఎత్తవలెనో కర్మచక్రపు పట్టు వీడగ..!?
ప్రేమ'మాధవ' వేణుగానము మాటు నిధులను మునిగినామా..!?
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు