Profile picture for user madhavaraokoruprolu1
మాధవరావు కోరుప్రోలు
టి. ఆర్.ఆర్. టౌన్ షిప్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ, మీర్ పేట, రంగారెడ్డి
9866995085

512..
నిన్ను చూచు వేళలోన ~ కలుగు హాయి అతిమధురం..!
నీ చెంతకు చేరినంత ~ పొందు హాయి అతి మధురం..!
మది పాడే నవ గీతిక ~ నీ కనులకు అంకితమిదె..!
నీ తలపుల మెరుపువాన ~ పంచు హాయి అతి మధురం..!
నీలిమబ్బుకేమి తెలుసు ~ నీ తనువది ఇచ్చు సొగసు..!
నీ వలపుల తరువు నీడ ~ ముసురు హాయి అతి మధురం..!
సెలయేటికి పరుగు నేర్పు ~ నీ నడకల హోయలేమో..!?
నీ నవ్వుల పసిడి తోట ~ వెలుగు హాయి అతి మధురం..!
మయూరముల నాట్యాలకు ~ లయను కూర్చు నెరజాణా..!
నీ మువ్వల సవ్వడి విన ~ నిండు హాయి అతి మధురం..!
వేణుగాన మధువులతో ~ అలరించే 'మాధవుడా'..!
నీ శ్వాసల దారిని కన ~ మిగులు హాయి అతి మధురం..!

మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు

అతిమధురం
గజల్
మీకు రచన నచ్చితే thumbs up ఇవ్వండి.
0
ఇది కవులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వారి జాతీయ రేటింగ్ పెరుగుతుంది.
No votes have been submitted yet.