515..
మౌనవనపు నెమలి ఆట ~ విందుచేయ వచ్చినావ..!
మందహాస హంస పాట ~ విందుచేయ వచ్చినావ..!
వసివాడని అక్షరాల ~ పరిమళాల అర్చింతును..!
సరస వీణ మరుల ఊట ~ విందుచేయ వచ్చినావ..!
బ్రహ్మకమల పీఠముపై ~ ఏల నాట్యమాడేవో..?!
శ్వాస సాక్షి పూలబాట ~ విందుచేయ వచ్చినావ..!
నీవు నడచు దారి వెంట ~ కాంతిపూల ముద్రలెన్నొ..?!
పరవశాల వలపుతోట ~ విందుచేయ వచ్చినావ..!
విరహాలను ఓదార్చే ~ పారిజాత సోయగమా..!
శ్రీ చందన సొగసు మూట ~ విందుచేయ వచ్చినావ..!
నీ రాధను మురిపించే ~ నవమోహన 'మాధవుడా'..!
వేణురాగ ఝరుల కోట ~ విందుచేయ వచ్చినావ..!!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు