517..
తన నవ్వులు విరబూసే.. ప్రతి నిముషం ఉత్సవమే..!
నా ఎదురుగ తానుంటే.. ప్రతి నిముషం ఉత్సవమే.. !
కోటి పూల పనిలేదుగ..ఒక్క సారి తను చూస్తే..!
నను అల్లరి పెడుతుంటే..ప్రతి నిముషం ఉత్సవమే..!
ఇంద్రధనువు వర్ణాలకు..పుట్టిల్లే మనసైతే..
ఓ సాక్షిగ నేనుంటే..ప్రతి నిముషం ఉత్సవమే..!
మంచుపూల రాగాలను వర్షించే ఓ నెచ్చెలి..!
నీ వలపే తోడైతే..ప్రతి నిముషం ఉత్సవమే..!
ఏ మధువుల అభిషేకం నే మెచ్చను ప్రియ సఖియా..!
నీ పలుకులు వింటుంటే..ప్రతి నిముషం ఉత్సవమే..!
అనిమిష రాధా 'మాధవ'..బృందావనమేదో మరి..?!
నీ మౌనపు కొలువుంటే..ప్రతి నిముషం ఉత్సవమే..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు