540..
మనసులోని సంగీతం..మాటలలో పలికేనా..!?
చెలి ఎదలో సుమగీతం..స్వరములలో ఒదిగేనా..!?
ఆ మబ్బుల మెరుపులలో..పొంగుతున్న వెలుగులలో..
విరబూసిన నవరాగం..చూపులలో ఒలికేనా..!?
గున్నమావి పలకరింపు..ఏ కోకిలకందేనో..!?
సందేహపు భూపాలం..వేకువలో..సాగేనా..!?
పైరగాలి పైటమాటు..చెలరేగే..అలజడేమొ..?!
ప్రేమవిందు హిందోళం..మదిమదిలో నిండేనా..?!
పాలపుంత మురిపాలకు..ఏ రాగం సరిపడును..?!
ఆకాశపు ఔదార్యం..ఔషధాల దొరికేనా..!?
మైత్రినిధుల మాధవునకు..ఆ'రాధయె..వేణువుగా..!
యమునాతటి సందోహం..చీకటిలో..అందేనా..!?
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు