548..
జాబిలెంత వెర్రిదోయి..వెన్నెలసలు దాచుకోదు..!
గగనమెంత పిచ్చిదోయి..వన్నెలసలు దాచుకోదు..!
ఈ నేను'ల లోభితనం..నేర్చినదే మానసమోయ్..!
కాలమెంత చిలిపిదోయి..కలతలసలు దాచుకోదు..!
తెలియలేని స్వార్థమేదొ..మేధస్సును పీడించును..!
మట్టి ఎంత మంచిదోయి..ఫలములసలు దాచుకోదు..!
పరస్పరము అదేపనిగ..కలసి ఆడు ముచ్చటేల..?!
అగ్ని ఎంత వెట్టిదోయి..వెలుగులసలు దాచుకోదు..!
కలహించే మనుషులెవరు లేరు చూడ తెలిసిందా..!
జలమదెంత జాలిదోయి..మబ్బులసలు దాచుకోదు..!
'మాధవుడా..'! విశ్వానికి ఆదర్శం నీ నడతే..!
వేణువెంత మేటిదోయి..స్వరములసలు దాచుకోదు..!
మాధవరావు కోరుప్రోలు
హైదరాబాద్
https://te.wikipedia.org/wiki/కోరుప్రోలు_మాధవరావు